Pending bills: చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల విడుదల చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:15 PM
చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 24: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. రాష్ట్ర సినిమా, ఫోటోగ్రఫీ ,రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 3,610 మంది చిన్న కాంట్రాక్టర్లకు రూ.94.77 కోట్ల బిల్లులు రేవంత్ సర్కార్ చెల్లించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి చిన్నకాంట్రాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని సీఎంకు విన్నవించారు. బిల్లుల చెల్లింపుతో తమకు బిగ్ రిలీఫ్ కలిగిందని కాంట్రాక్టర్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Sahiti Infra: సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ
HYDRAA: ఆక్రమణల తొలగింపు.. 2 వేల గజాల పార్కును కాపాడిన హైడ్రా