Venkaiah Naidu: కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంకయ్యనాయుడు పరామర్శ
ABN , Publish Date - Oct 24 , 2025 | 08:09 PM
కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఈ మేరకు కర్నూలు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. అనంతరం కర్నూలు అధికారులతో మాట్లాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన వార్త తెలిసి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సహా ఇతర అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు.
బాధిత కుటుంబాలకు అందుబాటులో ఉండాలని, మానవతా దృక్పథంతో వారికి సహకారం అందించాలని అధికారులకు మాజీ ఉపరాష్ట్రపతి సూచించారు. కాగా, ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు తాలూకా గోళ్లవారిపల్లెకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంకయ్యనాయుడు. అనంతరం బాధిత కుటుంబసభ్యులతోనూ ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu On UAE: దుబాయ్ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులపై చర్చ
Kurnool Bus Incident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..