Home » Politics
సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్‌లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
నేటి యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు.
రాయ్‌పూర్ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో పీఎం సమావేశమయ్యారు.
కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే.. తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలో పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.1,031 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
జనగాం జిల్లా శంకర్ తండా సమీపంలోని కుంటలో యువతి శ్రావ్య మృతదేహం లభ్యమయింది. నిన్న బోళ్లమత్తడి వద్ద ప్రేమికులు బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోయారు. చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ బయటపడగా, యువతి గల్లంతయ్యింది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వరి రైతులు నష్టపోయారని.. వారికి కూడా పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు పంట కోసిన కూడా 25 శాతం వచ్చే పరిస్థితి లేదన్నారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారిక గృహాల మరమ్మతుల ఖర్చుల పరిమితులు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల గృహాల రిపేర్ ఖర్చులకు కొత్త సీలింగ్ లిమిట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.