KTR: మణుగూరు పార్టీ కార్యాలయ దహనం చేసిన ఘటనపై కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:26 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మణుగూరు, నవంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలన్నారు.
త్వరలోనే మణుగూరును సందర్శించి, అదే ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి నిర్మాణం చేసుకుందామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని, అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని ఫైర్ అయ్యారు.
కాగా, ఇవాళ ఉదయం మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో మణుగూరులో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి వద్ద భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా.. చేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Yadagirigutta: సెలవు వేళ.. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి