Yadagirigutta: సెలవు వేళ.. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:44 AM
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తింది.
యాదాద్రి, నవంబర్ 2: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తింది. యాదగిరీశుని ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయ దర్శనం చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు.
నమో నరసింహాయ మంత్రంతో దేవాలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది. దేవాలయ పునర్నిర్మాణం అనంతరం భక్తులు రోజురోజుకి పెరుగుతున్నారు. రానున్న రోజుల్లో మరో తిరుమల దేవస్థానంగా యాదాద్రి కాబోయే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు. దేవాలయం దగ్గర్లోని సురేంద్రపురి, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
ఇవి కూడా చదవండి:
KTR: రేవంత్ రెడ్డికి రౌడీషీటర్లు అంటే గౌరవం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి