Share News

KTR: రేవంత్ రెడ్డికి రౌడీషీటర్లు అంటే గౌరవం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:31 AM

ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాతమని కేటీఆర్ తెలిపారు. సంతోషంగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు.

KTR: రేవంత్ రెడ్డికి రౌడీషీటర్లు అంటే గౌరవం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. భారత ఆర్మీపై రేవంత్ రెడ్డి నీచమైన కామెంట్స్ చేశారని ఆరోపించారు. తక్షణమే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని మండిపడ్డారు. మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్టపడుతున్నారు కాబట్టే, మనం సురక్షితంగా ఉంటూ.. రాజకీయాలు చేయగలుగుతున్నామన్న విషయం గుర్తుచ్చుకోవాలని హితవు పలికారు.


ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాతమని కేటీఆర్ తెలిపారు. సంతోషంగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం సీఎం రేవంత్ రెడ్డికి సరికాదని విమర్శించారు. ఇప్పటికే తన కామెంట్స్‌తో నీచమైన స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి, ఎన్నికల లబ్ధి కోసం ఆర్మీపై కామెంట్స్ చేసి మరింతగా తన స్థాయి దిగజార్చుకున్నారని ఆరోపించారు. భారత సైన్యాన్ని కించపరిచి, పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.


భారత సైన్యానికి క్షమాపణ చెప్పి.. రేవంత్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డికి గుండాలు, రౌడీషీటర్లు అంటేనే గౌరవం ఉటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి రేవంత్ రెడ్డి శత్రుదేశాన్ని గౌరవించడం ఆశ్చర్యమేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డి ఆపాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకైన మర్యాదగా ప్రవర్తించాలని కేటీఆర్ హితవు పలికారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి

Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం

Updated Date - Nov 02 , 2025 | 11:45 AM