Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:05 AM
బీబీ నగర్ హైవేపై ఓ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే అక్కడ నిలుచుని ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. పక్కనే ఉన్న చెరువులో పడి యువతి మృతి చెందింది.
బీబీ నగర్, నవంబర్ 2: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీ నగర్ హైవేపై ఓ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే అక్కడ నిలుచుని ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. పక్కనే ఉన్న చెరువులో పడి యువతి మృతి చెందింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.