Chevella Accident: చేవెళ్ల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:27 AM
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు.
చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని చెప్పారు. చేవెళ్లలోనే అన్ని మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Chevella Accident update: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే..
RTC Passengers Insurance: ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకులకు ఇన్స్యూరెన్స్ ఎందుకు లేదు.?