CM Chandrababu: లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:14 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి లండన్ వెళ్లారు. ఈ మేరకు లండన్ తెలుగు కుటుంబాలు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు.
అమరావతి, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి లండన్ వెళ్లారు. ఈ మేరకు లండన్ తెలుగు కుటుంబాలు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. వారిని సీఎం దంపతులు అప్యాయంగా పలకరించారు. ఈనెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి నారా భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఆమె అందుకోనున్నారు.
అలాగే ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో నారా భువనేశ్వరి కృషికి గుర్తింపు రావడంతో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారు. భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి:
Rapido Bike Driver Misbehaves: ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన
Minister Ramanarayana Reddy: కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తప్పేది..