Chevella Accident: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:35 AM
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో పోస్టుమార్టం ఒకే చోట నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో పోస్టుమార్టం ఒకే చోట నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. తాండూర్ నుండి హైదరాబాద్‌కు బస్సు ఉదయం 5 గంటలకు బయలుదేరినట్లు అధికారులు గుర్తించారు. బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు 30 మంది తాండూరుకు చెందిన ఉద్యోగులుగా వెల్లడించారు.
అటు ఈ ప్రమాద ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. ఈ కేసును లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసుపై రాజేంద్రనగర్ డీసీపీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో ఇప్పటికే క్లూస్ టీం ఆధారాలను సేకరించింది గత ఏడాది డిసెంబర్‌లో కూడా మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు వద్ద టిప్పర్ దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అధికారికంగా వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. అటు మృతుల బంధువులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. బంధువుల ఆర్తనాదాల మధ్య ఘటనాస్థలి వద్ద హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ప్రమాద స్థలంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
Chevella Accident: చేవెళ్ల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రకటన
Khammam News: మద్యానికి బానిసైన కొడుకు.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి