Khammam News: మద్యానికి బానిసైన కొడుకు.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:40 AM
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం: తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు మద్యానికి బానిస అయ్యాడని కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు ఓ తండ్రి. వివరాళ్లోకి వెళ్తే.. ఆదూరి రాజేష్ కుమారుడు ఆదూరి నాగరాజు(18) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన వినకపోవడంతో.. విసుగు చెందిన రాజేష్ తన కుమారుడు నాగరాజుకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చాడు.
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత పది రోజులుగా మృత్యువుతో పోరాడిన నాగరాజు ఇవాళ(సోమవారం) చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు.. తండ్రి రాజేష్‌పై తల్లాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు