Rega Kantarao: వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు: రేగా
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:18 PM
మణుగూరు పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేగా కాంతారావు తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మణుగూరు, నవంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు పట్టణంలో జరిగిన బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడిని ఖండిస్తూ పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. భౌతిక దాడులకు భయపడేది లేదని.. ఎంత రెచ్చకోడితే అంత ఎక్కువ ప్రశ్నిస్తామన్నారు. ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన అయ్యేదేంటని.. కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.
ఎవరులేని సమయాన భౌతిక దాడులు చేయడం సిగ్గుపడాల్సిన చర్య అని పేర్కొన్నారు. భౌతిక దాడులు పిరికి పందల చర్య అని మండిపడ్డారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని.. భవిష్యత్ తమదేనన్నారు. మణుగూరు పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పంటిచారు. దీంతో ఫర్నీచర్ మొత్తం కాలిపోయింది. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో మణుగూరులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా.. చేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల దాడిపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Yadagirigutta: సెలవు వేళ.. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
KTR on HYDRAA: పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా?.. కేటీఆర్ ఫైర్