Kavitha: జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ.. ప్రకటించిన కవిత
ABN , Publish Date - Nov 02 , 2025 | 09:43 AM
జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షులుగా బుర్ర రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ లను నియమిస్తున్నట్లు జాగృతి అధికారిక ఎక్స్ (X) ఖాతా వేదికగా స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ జాగృతి మరో ప్రకటన చేసింది. జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షులుగా బుర్ర రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ లను నియమిస్తున్నట్లు జాగృతి అధికారిక ఎక్స్ (X) ఖాతా వేదికగా స్పష్టం చేశారు.
వీరి నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. తెలంగాణ సమాజ అభ్యున్నతి కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని కవిత తెలిపారు. నూతన కమిటీకి నియమితులైన బాధ్యులు విద్యారంగ వికాసానికి, టీచర్ల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Vikarabad Crime News: కులకచర్లలో దారుణం.. భార్య, కూతురు, వదినను గొంతుకోసి...
CM Revanth Reddy accused BRS: బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యరహస్య ఒప్పందం