BRS: మణుగూరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి.. 144 సెక్షన్ అమలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:58 PM
మణుగూరు వివాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు గుంపులు, గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు.
మణుగూరు, నవంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వివాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు గుంపులు, గుంపులుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా పార్టీ కార్యాలయం వద్ద పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేగా కాంతారావు విజయం సాధించి కొద్దికాలం తరువాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంతారావు.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చారు. దీనిపై అప్పట్లోనే కాంగ్రెస్ కార్యకర్తలు రేగాకాంతారావు తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాయం వేంకటేశ్వర్లు గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మళ్లీ కార్యాలయ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆఫీసు వద్దకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఫర్నీచర్ ధ్వంసం చేసి నిప్పంటించారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Ranga Reddy: తీవ్ర ఉద్రిక్తత.. మహిళా కానిస్టేబుల్‌పై విద్యార్థినుల దాడి
KTR on HYDRAA: పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా?.. కేటీఆర్ ఫైర్