Home » Politics
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్వీట్ షాపులపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని 43 స్వీట్ షాప్స్ లో 3 రోజుల పాటు అధికారులు ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు? ఈ సమస్యపై మంత్రి వర్గం స్పందన ఎలా ఉంటుంది? జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు మోదీకి స్వాగతం పలికారు.
సీఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవని కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. రేవంత్‌ను కొండా సురేఖ వైఎస్‌తో పోల్చారు అని చెప్పారు. మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకు తెలియదని చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని.. ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నిక పదేండ్ల అభివృద్ధి పాలనకి.. రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఉపఎన్నిక అని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది. బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు అధికశాతంలో ఉండటంతో ఉపఎన్నికల ఫలితాన్ని వీరే నిర్ణయించనున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లలో అధికశాతం బీసీలు, ముస్లింలు ఉండటంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలుపొందనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాల ఆదరణ పొందే పనిలో నిమగ్నమయ్యారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే నెపంతో సునీతను ఏ1గా, అక్షరను ఏ2గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరిలో శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల క్యాంపెయినింగ్‌లో భాగంగా వీరు నిర్వహించిన ప్రచారంపై కేసు నమోదయింది.
పీజేఆర్ కొడుకు విష్ణు చేసిన వ్యాఖ్యలపై పీజేఆర్ కూతురు విజయారెడ్డి స్పందించారు. ఏబీఎన్‌తో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మా నాన్న, పీజేఆర్ కాంగ్రెస్ మనిషి అని, కాంగ్రెస్‌ను గెలిపించడమే పీజేఆర్‌కి ఇచ్చే నివాళి అవుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే పీజేఆర్‌ని గెలిపించినట్టు అవుతుందని చిన్న పిల్లలకి కూడా తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.