CM Chandrababu: అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:43 PM
అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు.
కడప, అక్టోబర్ 18: అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు.
హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవానికి సహకారం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
P.V.N.Madhav: బీజేపీకి ఒక మతాన్ని అంటకట్టడం కరెక్ట్ కాదు: పి.వి.ఎన్.మాధవ్
Rammohan Naidu Google Investment: స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు..