Share News

P.V.N.Madhav: బీజేపీకి ఒక మతాన్ని అంటకట్టడం కరెక్ట్ కాదు: పి.వి.ఎన్.మాధవ్

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:31 PM

సర్వధర్మ సమభావన, హైందవ ధర్మం నిత్యనూతనమనేది బీజేపీ నినాదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ స్పష్టం చేశారు. లోకాకళ్యాణార్థo..అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామని చెప్పారు.

P.V.N.Madhav: బీజేపీకి ఒక మతాన్ని అంటకట్టడం కరెక్ట్ కాదు: పి.వి.ఎన్.మాధవ్
P.V.N.Madhav

అమరావతి, అక్టోబర్ 18: బీజేపీ పార్టీకి ఒక మతాన్ని అంటకట్టడం కరెక్ట్ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. తిరుపతి పట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వధర్మ సమభావన, హైందవ ధర్మం నిత్యనూతనమనేది బీజేపీ నినాదమని స్పష్టం చేశారు. లోకాకళ్యాణార్థo..అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామని చెప్పారు. వివక్ష గురవుతున్న సమాజంలో వారి గుర్తింపు, గౌరవాన్ని పెంచుతామని చెప్పారు.


క్షురకులు అంటే సమాజంలో చిన్నచూపు ఉందని.. నాయిబ్రాహ్మణులు బలహీనులు కాదు, బలవంతులని తెలియచెప్పడమే బీజేపీ ఉద్దేశ్యమని తెలిపారు సంజీవిని, స్వరం కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. నాయిబ్రాహ్మణులకు నాదస్వరం, ధన్వంతరి ఆయుర్వేదం రెండూ తెలుసు అని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి:

AP Ministerial Sub Committee Meeting: ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు

Rammohan Naidu Google Investment: స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు..

Updated Date - Oct 18 , 2025 | 01:31 PM