Mamunuru Airport: మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ.. నిధులు విడుదల
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:19 AM
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్, అక్టోబర్ 17: వరంగల్ జిల్లాలోని నిర్మించనున్న మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది జూలైలో రూ.205 కోట్లును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ. 90 కోట్లు కేటాయించాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మామునూరు విమానాశ్రయం కోసం మొత్తంగా 253 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 17న మొదట రూ.205 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తంగా 309 మంది రైతులు, మరో 50 మంది ప్లాట్ల యజమానుల వద్ద ఈ భూమిని సమీకరించనున్నారు. పనులను వేగవంతం చేసేందుకు అధికారులు గ్రామాలవారీగా భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు.భూ సేకరణతో నష్టపోతున్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.కోటి 20 లక్షల చొప్పున చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్పోర్ట్ఏర్పాటులో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో రూ.205 కోట్ల నిధులను 2025 జులైలో విడుదల చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా భూ సేకరణ కోసం రూ. 90 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం వేగవంత కానుంది.
ఇవి కూడా చదవండి:
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వం, ఈసీకి సూటి ప్రశ్న
HYDRAA: ఆక్రమణల పర్వానికి హైడ్రా ఫుల్‌స్టాప్..రూ.110 కోట్ల విలువైన భూమికి విముక్తి