HYDRAA: ఆక్రమణల పర్వానికి హైడ్రా ఫుల్‌స్టాప్..రూ.110 కోట్ల విలువైన భూమికి విముక్తి
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:46 AM
ఆసిఫ్‌నగర్ మండలం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపూర్ విలేజ్‌లోని సర్వే నంబరు 50లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అశోక్ సింగ్ అనే వ్యక్తి ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. అందులో షెడ్డులు వేసి విగ్రహ తయారీదారులకు అశోక్ సింగ్ అద్దెకు ఇస్తున్నట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 17: హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఆక్రమణల పర్వానికి హైడ్రా ఫుల్‌స్టాప్ పెట్టింది. సిటీలోని గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపురాలో కబ్జాలను తొలగించింది. రూ.110 కోట్ల విలువైన 1.30 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని భావించిన ప్రభుత్వం.. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రతిపాదనలు చేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫ్‌నగర్ మండలం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపూర్ విలేజ్‌లోని సర్వే నంబరు 50లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అశోక్ సింగ్ అనే వ్యక్తి ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. అందులో షెడ్డులు వేసి విగ్రహ తయారీదారులకు అశోక్ సింగ్ అద్దెకు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో కుల్సుంపురలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైదరాబాద్ కలెక్టర్ హైడ్రాను కోరారు. ప్రజావసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
గజం స్థలం కూడా దొరకని కుల్సుంపురలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రాకు ప్రజావాణిలో కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకొని కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆక్రమణలను తొలగించింది. ఈ స్థలం తన భూమిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టును అశోక్ సింగ్ అనే వ్యక్తి ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పారు.
ఇప్పటికే రెవెన్యూ అధికారులు రెండు సార్లు ఆక్రమణలను తొలగించారు. అయినా ఆ స్థలం ఖాళీ చేయకుండా అశోక్ సింగ్ అద్దెలు అనుభవిస్తూ వస్తున్నాడు. ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై అశోక్ సింగ్ దాడులకు పాల్పడ్డాడు. అశోక్ సింగ్‌పై వివిధ పోలీసు స్టేషన్లలో భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్‌గా పేర్కొంటూ పలు కేసులు నమోదయ్యాయి లంగర్‌హౌస్, మంగళహాట్, శాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్లలో అశోక్ సింగ్‌పై 8కి పైగా కేసులు నమోదయ్యాయి.అటు ఇదే ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది.
ఇవి కూడా చదవండి:
Fake voter cards: హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు
TGSRTC: దీపావళి పండగ ఎఫెక్ట్.. పేలుతున్న టికెట్ ధరలు