Share News

Fake voter cards: హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:12 AM

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.

Fake voter cards: హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు
Fake voter cards

ఇంటెర్నెట్ డెస్క్, అక్టోబర్ 17: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధుర నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పిర్యాదు మేరకు 336(4), 353(1)(C) BNS సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేశారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. ఈ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

MLA: ప్రజల గుండెల్లో బీఆర్‌ఎస్‌ పదిలం

Madhura Nagar Incident: ఇది తెలిస్తే అద్దెకు ఉండాలంటే కూడా భయపడతారేమో...

Updated Date - Oct 17 , 2025 | 10:33 AM