Madhura Nagar Incident: ఇది తెలిస్తే అద్దెకు ఉండాలంటే కూడా భయపడతారేమో...
ABN , Publish Date - Oct 17 , 2025 | 09:33 AM
వారి ఇంటిలోని బాత్రూమ్‌లో బల్బ్ పనిచేయడం లేదు. ఇదే విషయాన్ని వారు ఓనర్ అశోక్ యాదవ్‌కు తెలిపారు. ఇక్కడే అతడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు.
హైదరాబాద్, అక్టోబర్ 17: నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అద్దెకు ఉంటున్న వారి పట్ల ఆ ఇంటి యజమాని ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. అద్దెకు ఉంటున్న వారు తమ ఇంట్లో ఏమన్నా రిపేర్ వస్తే ఓనర్‌కు చెప్పడం కామన్. దానిని వారు రిపేర్ చేపిస్తుంటారు. అదే విధంగా ఓ దంపతులిద్దరు కూడా ఇంట్లోని బాత్రూమ్‌లో బల్బ్ హోల్డర్ పనిచేయడం లేదని యజమానికి చెప్పారు. అయితే అతడు చేసిన పాడు పని చూసి అవాక్కయ్యారు దంపతులు. ఇదేంటని ప్రశ్నించగా.. తిరిగి వారినే బెదిరించాడు సదరు ఓనర్. ఇంతకీ ఇంటి ఓనర్ చేసిన పాడు పని ఏంటో చూద్దాం.
నగరంలోని మధురానగర్ యూసఫ్‌గూడలో దంపతులిద్దరు ఓ ఇంట్లో రెంట్‌కు ఉంటున్నారు. ఈ క్రమంలో వారి ఇంటిలోని బాత్రూమ్‌లో బల్బ్ పనిచేయడం లేదు. ఇదే విషయాన్ని వారు ఓనర్ అశోక్ యాదవ్‌కు తెలిపారు. ఇక్కడే అతడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. దంపతులకు తెలీయకుండా బాత్రూమ్‌లోని బల్బ్ హోల్డర్‌లో రహస్య కెమెరాను ఏర్పాటు చేశాడు ఇంటి యజమాని. ఇందుకు అతడికి ఎలక్ట్రిషన్ చింటూ సహాయపడ్డాడు. ఆ తరువాత ఏమీ తెలియకుండా అంతా రిపేర్ చేసినట్లు రెంటర్‌కు చెప్పి వెళ్లిపోయారు. అయితే బల్బ్ హోల్డర్‌లో కెమెరా ఉన్నట్లు బాధితురాలి భర్త ఉమేష్ గుర్తించి షాక్‌కు గురయ్యాడు.
ఇదే విషయంపై ఇంటి ఓనర్‌ను ప్రశ్నించగా... తిరిగి దంపతులిద్దరినీ బెదిరింపులకు పాల్పడ్డాడు. కేసు పెడితే జైలు నుంచి వచ్చాక చంపేస్తామని దంపతులిద్దరినీ నిందితులు బెదిరించారు. అయినప్పటికీ తమకు జరిగిన అన్యాయంపై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో దంపతులు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి ఓనర్ అశోక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎలక్ట్రిషన్ చింటూ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
భార్యపై కోపం.. అత్తింటిని తగలబెట్టిన భర్త.. ఏమైందంటే?
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Read Latest Telangana News And Telugu News