Jubilee Hills by-election: ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి..
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:49 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పర్యవేక్షణలో గురువారం ర్యాండమైజేషన్ నిర్వహించారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు కర్ణన్ ఆదేశం
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) పర్యవేక్షణలో గురువారం ర్యాండమైజేషన్ నిర్వహించారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీ ప్యాట్‌లు కేటాయించారు. ప్రక్రియ పరిశీలనకు హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ర్యాండమైజేషన్ వివరాలు వెల్లడించారు.

ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను నియోజకవర్గ స్ర్టాంగ్ రూముల్లో భద్రపరిచారు. అభ్యర్థుల తుది జాబితా ఖరారు అనంతరం వివరాలను వారితో పంచుకుంటారు. అంతకుముందు యూసుఫ్‌గూడ(Yusufguda)లోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియం(Kotla Vijaya Bhaskar Reddy Stadium)లోని డిస్ర్టిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ కేంద్రం (డీఆర్‌సీ)ని పరిశీలించిన కర్ణన్ ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News