MLA: ప్రజల గుండెల్లో బీఆర్‌ఎస్ పదిలం
ABN , Publish Date - Oct 17 , 2025 | 09:46 AM
ప్రజల గుండెల్లో బీఆర్‌ఎస్ పదిలంగా ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: ప్రజల గుండెల్లో బీఆర్‌ఎస్(BRS) పదిలంగా ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, పల్లారాజేశ్వర్‌రావులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీనగర్‌లో కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీకార్డులను పంపిణీ చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికల హామీలపై నిలదీయాలని ఓటర్లకు వారు సూచించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పల్లవిమహేందర్‌యాదవ్, ఎర్రగడ్డ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

నిజాంపేటలో అలయ్‌బలయ్
బాలానగర్: ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ ఫతేనగర్ సీనియర్ నాయకుడు కూతాడి రాములు ఆధ్వర్యంలో గురువారం నిజాంపేట ఎరుకల భవనంలో అలయ్‌బలయ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారావు(MLA Krishna Rao) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించబడ్డాయన్నారు. ఎరుకల కులస్థులకు స్థలాన్ని కేటాయించడంతో పాటు భవనాన్ని ఎరుకలకు కానుకగా అందజేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. అనంతరం సంఘం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News