Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వం, ఈసీకి సూటి ప్రశ్న
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:47 PM
సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం, ఈసీ కోరింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 17: తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చూటుచేసుకుంటున్నాయి. తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ లో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం, ఈసీ కోరింది. దీంతో హైకోర్టు ఇందుకు అంగీకరించి రెండు వరాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఆ జీవోపై స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టకుండానే అత్యున్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీనితో స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Bhatti Vikramarka OBC Reservation: బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి
HYDRAA: ఆక్రమణల పర్వానికి హైడ్రా ఫుల్‌స్టాప్..రూ.110 కోట్ల విలువైన భూమికి విముక్తి