Home » PM Modi
జంగిల్ రాజ్ అంటే తుపాకులు, క్రూరత్వం, సామాజిక వ్యతిరేకత, అవినీతి అని మోదీ అభివర్ణించారు. హింసను ప్రోత్సహించే ప్రభుత్వం మనకు అవసరం లేదని, ఎన్డీయే ప్రభుత్వానికి తిరిగి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.
నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని మోదీ చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
భారత అమ్మాయిల జట్టు తొలిసారి ప్రపంచ కప్ సాధించి చర్రిత సృష్టించింది. క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచింది. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
బిహార్‌లోని సహర్సాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రజలకు అందే ఎలాంటి సాయమైనా 'జంగిల్ రాజ్' నేతలు నిలిపేస్తారని, వారికి అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉండదని చెప్పారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరగబోతోందని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.
ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి ఎన్డీయే గెలుపు ఖాయమని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఎన్డీయే చేపట్టిన అభివృద్ధి మోడల్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది చాటుతోందన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఆర్జేడీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అయితే కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి మరీ సీఎం పోస్ట్‌ను ఆర్జేడీ చోరీ చేసిందని అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న అనుబంధాన్ని మోదీ వివరిస్తూ, తన కెరీర్‌ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.