Share News

PM Kisan Yojana: రైతుల ఖాతాల్లో రూ.2,000.. ఎప్పుడొస్తాయంటే..!

ABN , Publish Date - Jan 09 , 2026 | 09:40 PM

దేశంలోని కోట్లాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రూ.6వేలను వాయిదా పద్ధతిలో అందిస్తున్నారు. అయితే, ఈసారి 22వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

PM Kisan Yojana: రైతుల ఖాతాల్లో రూ.2,000.. ఎప్పుడొస్తాయంటే..!
PM Kisan 22nd Installment

ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరం వేళ లక్షల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 22వ విడత నిధుల విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అందే రూ.2,000లు రైతు కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఇస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలుగా రైతుల ఖాతాలో నేరుగా బ్యాంకులు జమ చేస్తారు. ఇప్పటివరకూ 21 వాయిదాలు విడుదల చేసింది కేంద్రం. లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.


ఈ క్రమంలోనే 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. మీడియా నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ యొక్క 22వ విడత ఫిబ్రవరి 2026లో విడుదల కావచ్చు. కాకపోతే ఈ విషయం గురించి అఫిషియల్ గా ఎలాంటి ప్రకటనా రాలేదు. సాధారణంగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ‘బడ్జెట్’ ముందే నిధులు విడుదల చేస్తుంటారు. ఈసారి, కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పలు కీలక మార్పులు చేశారు. ఇకపై ఈ-కేవైసీ మాత్రమే సరిపోదని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. ఐడీ లేని రైతులకు వాయిదాలను నిలిపి వేయొచ్చు. సరైన రైతులకు మాత్రమే చేరేలా ఈ పథకం ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.


ఈ-కేవైసీ ఎప్పటికైనా అవసరం.. రైతుల ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ లోని ఓటీపీని ఉపయోగించి ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ కేవైసీ సమీపంలోని సీఎస్‌సీ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. ఒక్కోసారి ఈ-కేవైసీ కాకుండా ఇతర కారణాల వల్లా వాయిదాలు నిలిచిపోవొచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతా సమాచార లోపం, ఐఎఫ్ఎస్‌సీలో మార్పు, కేవైసీలో భూమి రికార్డు సమస్యలు వంటి కారణాల వల్ల కూడా ఖాతాలో నగదు పడకపోవచ్చు. దీంతో రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయడం, ఐడీ పొందండి, బ్యాంక్, భూమి వివరాలు సరిగ్గా ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అమిత్ షా ఆఫీస్‌ ముందు ఆందోళన.. టీఎంసీ ఎంపీలు అరెస్ట్

సమస్య ఏదైనా నెహ్రూను విమర్శించడం సరికాదు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2026 | 10:00 PM