Home » PM Modi
పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి రానున్నారు.
ప్రజల నివాసానికి, జీవన వికాసానికి అత్యంత ప్రముఖమైన నగరంగా సాగరనగరం విశాఖను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముంబై, వారణాసి, సూరత్, విశాఖల అభివృద్ధికి కేంద్రం సరికొత్త విజన్ తెచ్చిందని..
కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు.
రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని ఆ వెంటనే లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హోం మంత్రి అమిత్షాకు ఫోను చేసి మాట్లాడారు.
ప్రముఖ కవి అందెశ్రీ హఠాన్మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. అందెశ్రీ పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉందన్నారు.
సీతామర్హిలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ఒకానొక సమయంలో బిహార్ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను సేకరించేదని, కానీ మత్స్యశాఖకు సంబంధించి తాము తీసుకున్న చర్యల కారణంగా బిహార్ ఇప్పుడు చేపల పెంపకంలో స్యయం సమృద్ధిని సాధించిందని చెప్పారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.