Bagurumba: గువాహటీలో అద్భుతమైన బగురుంబా నృత్య కార్యక్రమం.. బోడో సంస్కృతి ప్రదర్శన
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:22 AM
భారతదేశపు వైవిధ్యతను ఏకం చేస్తూ, వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంచే విధంగా అస్సాం రాష్ట్రంలో బగురుంబా నృత్య ప్రదర్శన జరిగింది. భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించింది. ఈ కార్యక్రమంపై స్పందించిన ప్రధాని మోదీ.. బగురుంబా ద్వౌ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 18: అస్సాం రాష్ట్రంలో అతిపెద్ద నగరం, ఈశాన్య భారతదేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రం గేట్‌వేగా గువాహటీ నగరానికి పేరుంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఈ నగరంలో కామాఖ్య, ఉగ్రతార వంటి అనేక పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రాముఖ్యత, విభిన్న వన్యప్రాణులు, రుచికరమైన అస్సామీ వంటకాలు, మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. దీనిని 'దేవాలయాల నగరం' అని కూడా పిలుస్తారు.

ఈ పవిత్ర నగరమైన గువాహటీలోని సరుసాజై స్టేడియంలో 'బగురుంబా ద్వౌ 2026' కార్యక్రమం కన్నులపండువగా సాగింది. భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఈ చారిత్రాత్మక ఈవెంట్‌లో 10,000 మందికి పైగా బోడో కళాకారులు ఒకే సమయంలో, ఒకే విధంగా బగురుంబా డ్యాన్స్ ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

బోడో సమాజానికి చెందిన ఈ సంప్రదాయ నృత్యం సీతాకోకచిలుకలు ఎగరడాన్ని పోలిన మృదువైన కదలికలతో ప్రకృతిని ప్రతిబింబించింది. అలాగే వసంత ఋతువు రాకను, పూలు, సీతాకోకచిలుకలను సూచిస్తూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ కార్యక్రమం బోడో సమాజం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. స్టేడియంలో ఎరుపు, నారింజ రంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన వేలాది నృత్యకారులు ఒకే సమయంలో కదలికలు చేస్తూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి మోదీ ఈ ఈవెంట్‌లో పాల్గొని బోడో సంప్రదాయ సంగీత వాయిద్యం 'సెర్జా'ను తిలకించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా హాజరైన ఈ కార్యక్రమం.. ఈశాన్య భారతదేశం సాంస్కృతిక ప్రాముఖ్యతను జాతీయ స్థాయిలో చాటిచెప్పింది.
భారతదేశపు వైవిధ్యతను ఏకం చేస్తూ, వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంచే విధంగా అస్సాం రాష్ట్రంలో బగురుంబా డ్యాన్స్ ప్రదర్శన జరిగింది. భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించే విధంగా సాగింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్రమోదీ పోస్ట్ చేశారు. గువాహటీలో అద్భుతమైన బగురుంబా ద్వౌ కార్యక్రమం అంటూ మోదీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
For More Devotional News And Telugu News