Share News

PM Modi Bengal Visit: 17, 18 తేదీల్లో బెంగాల్‌లో మోదీ పర్యటన

ABN , Publish Date - Jan 16 , 2026 | 06:51 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ప్రకారం మైనారిటీల ఆధిపత్యం ఉన్న బెంగాల్‌లోని మాల్డాలో ఈనెల 17న జరిగే బహిరంగ ర్యాలీలో పాల్గొంటారు. సింగూర్‌లో జరిగే మరో ర్యాలీకి కూడా హాజరవుతారు.

PM Modi Bengal Visit: 17, 18 తేదీల్లో బెంగాల్‌లో మోదీ పర్యటన
PM Modi

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈనెల 17,18 తేదీల్లో పశ్చిమబెంగాల్(West Bengal)లో పర్యటించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు రాజకీయ ర్యాలీల్లోనూ పాల్గొంటారు. ఎన్నికల జాబితా ఎస్ఐఆర్(SIR) ప్రక్రియ, టీఎంసీ రాజకీయ కన్సెల్టెన్సీ ఐ-ప్యాక్‌(I-PAC)పై ఇటీవల జరిగిన ఈడీ దాడులతో బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది.


షెడ్యూల్ ప్రకారం.. మైనారిటీల ఆధిపత్యం ఉన్న మాల్డాలో ఈనెల 17న జరిగే బహిరంగ ర్యాలీలో మోదీ పాల్గొంటారు. సింగూర్‌లో జరిగే మరో ర్యాలీకి కూడా హాజరవుతారు. శనివారం సాయంత్రం మాల్డాకు ప్రధాని చేరుకుంటారని, తొలుత ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత సమీప గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర నేత ఒకరు తెలిపారు. ఆదివారం నాడు మరలా బెంగాల్ వచ్చి హుగ్లీలోని సింగూర్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని, ఆ వెంటనే పబ్లిక్ ర్యాలీకి హాజరవుతారని చెప్పారు. ఆ రాత్రి కోల్‌కతాలోనే బస చేస్తారా అనేది మాత్రం వెల్లడించలేదు.


పీఐబీ ప్రకటన ప్రకారం.. ప్రధాని జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటలకు మాల్డా చేరుకుంటారు. హౌరా-గౌహతి మధ్య నడిచే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఆదివారం నాడు హుగ్లీ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తారు.


ఎస్ఐఆర్‌ పేరుతో సాధారణ పౌరులను బీజేపీ, ఎన్నికల కమిషన్ వేధిస్తోందని.. దీనికి బ్యాలెట్ బాక్స్‌ వద్దే ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని అధికార టీఎంసీ కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే.. ఈ వాదనలను బీజేపీ తోసిపుచ్చుతోంది. అక్రమ వలసదారులు, రోహింగ్యాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఎస్ఐఆర్ తప్పనిసరని, గణనీయంగా తమ ఓటు బ్యాంకు కోల్పోతోందనే అక్కసుతోనే టీఎంసీ తప్పుడు ఆరోపణలను చేస్తోందని చెబుతోంది.


ఇవి కూడా చదవండి..

గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు

ఓటు చోరీ ముమ్మాటీకీ దేశద్రోహ చర్యే.. బీఎంసీ ఓట్ల లెక్కింపు వేళ రాహుల్ గాంధీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 16 , 2026 | 07:49 PM