Home » PM Modi
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఆవిష్కృతమైన వేళ...ఉత్తరాంధ్రకు ఉత్సవ కళ వచ్చింది. నేల ఈనిందా... అన్నట్టు భోగాపురానికి జనం పోటెత్తారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆదివాసీ బాలికల థింసా నృత్యం అద్భుతమని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. 13 వేల మందికిపైగా ఆదివాసీ బాలికలతో ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రదర్శన ఇచ్చారన్నారు.
కామన్వెల్త్ గేమ్స్2026లో భారతదేశానికి పతకాలు అందించిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జావెలిన్ త్రోలో రజతం గెలిచిన నీరజ్ చోప్రా, కాంస్య పతక విజేత యశ్వీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ గిరిజన విద్యార్థినిలు, మహిళలు చేసిన థింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భారత్‌ను ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తోన్న నేత ప్రధాని మోదీ అని కొనియాడారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్ర కలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెక్కలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. విభజన వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.