Home » Penukonda
ఇన సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని శెట్టిపల్లి, కొండాపురం, రాంపురం, పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, మరువపల్లి, తిమ్మాపురం హైస్కూల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.
సివిల్ సప్లై స్టాక్‌పాయింట్‌లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న డీఈఓ, సెక్యూరిటీ, పంప్ బాయ్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ డిమాండ్ చేశారు.
సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.
అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.