Share News

MINISTER SAVITHA: ఐదెకరాల్లో గిరిజన గురుకుల వసతిగృహం

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:32 AM

పెనుకొండ సమీపంలో ఐదు ఎకరాల్లో గిరిజన గురుకుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని నిర్మిస్తామని మంత్రి సవిత అన్నారు. సోమవారం పట్టణంలోని వసతిగృహాన్ని ఆమె ద్విచక్రవాహనంలో వెళ్లి తనిఖీ చేశారు.

MINISTER SAVITHA: ఐదెకరాల్లో గిరిజన గురుకుల వసతిగృహం
Minister Savita is learning about the students' problems

పెనుకొండ టౌన, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పెనుకొండ సమీపంలో ఐదు ఎకరాల్లో గిరిజన గురుకుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని నిర్మిస్తామని మంత్రి సవిత అన్నారు. సోమవారం పట్టణంలోని వసతిగృహాన్ని ఆమె ద్విచక్రవాహనంలో వెళ్లి తనిఖీ చేశారు. వసతిగృహంలో వసతులపై విద్యార్థులతో ఆరా తీశారు. అనంతరం సిబ్బంది పనితీరు, వంటగది, మరుగుదొడ్లు తదితరాలను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, వైద్యపరీక్షలు తరచూ చేయించాలని అధికారులను ఆదేశించారు. కన్వీనర్‌ శ్రీరాములు, బాబుల్‌రెడ్డి, ఎగువగడ్డ కృష్టమూర్తి, షౌకత పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:32 AM