TDP: అభివృద్ధి బాటలో సోమందేపల్లి
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:21 AM
అభివృద్ధి బాటలో సోమందేపల్లి మండలం పరుగులు పెడుతోంది. మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు.
చురుగ్గా డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం
సోమందేపల్లి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి బాటలో సోమందేపల్లి మండలం పరుగులు పెడుతోంది. మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు. సోమందేపల్లిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆమె సారథ్యంలో స్థానిక నాయకులు మేముసైతం అంటూ పలు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. దగ్గరుండిపనులు పర్యవేక్షించి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లకాలంలో అభివృద్ధి సంక్షేమం అటకెక్కింది. కేవలం మాటల్లోనే అభివృద్ధిని చూపారు. అభివృద్ధి అంటే మాటలుకాదు చేతలు అని నిరూపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండల, గ్రామనాయకులు ఆయా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. శుక్రవారం పట్టణంలో జరుగుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు సూరీ, కిష్టప్ప, నాగరాజు, చిరంజీవి, మురళి, సురేష్ పరిశీలించారు. సాయినగర్‌లో మురుగునీరు వెళ్లడానికి ప్రధాన కాలువ లేకపోవడంతో సమస్యను స్థానిక ప్రజలు గతంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లగా రూ.5లక్షలు మంజూరు చేశారు. రమాకాంతరెడ్డి ఇంటి నుంచి జేజేఆర్ నగర్ మాజీ ఎంపీటీసీ కిష్టప్ప ఇంటివరకు నిర్మిస్తున్న కాలువ పనులను నాయకులు పరిశీలించారు. అలాగే స్నేహలతనగర్, అంబేడ్కర్‌నగర్, నేతాజీనగర్, సప్తగిరి కాలనీ, గీతానగర్, ద్వారకమయినగర్ తదితర ప్రాంతాల్లో రూ.2కోట్లతో చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. నాయకులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సర్కిల్‌లో డివైడర్ వెడల్పుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో దానిని తొలగించి కొత్త డివైడర్‌ను నిర్మించామన్నారు. సోమందేపల్లి చెరువుకు ఆయకట్టు 500ఎకరాలుండగా నీరందక రైతులు ఇబ్బందిపడుతున్న తరుణంలో మంత్రి సవిత హంద్రీనీవా ద్వారా పైప్‌లైన ఏర్పాటుచేసి పొలాలకు నీరందించారన్నారు. మెరుగైన విద్యుత సేవల కోసం అన్ని కాలనీల్లో స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత సరఫరాను అందించారన్నారు. 11కేవీ విద్యుతలైనను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.