వీఆర్వో మోసం చేశాడని రైతు ఫిర్యాదు
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:12 AM
మండలం మాగేచెరువు వీఆర్‌ఓ సోమశేఖర్‌నాయక్ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.
సోమందేపల్లి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలం మాగేచెరువు వీఆర్‌ఓ సోమశేఖర్‌నాయక్ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం రైతులు పి.కిష్టప్ప, వెంకటరమణమ్మ, అన్న కొడుకు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ సర్వేనంబరు 196/5లో 4.80, 186/1లో 2.44, 186/4లో 0.22, 186/5లో 0.56, 186/6 లో 0.12ఎకరాలు, మొత్తం ఎనిమిది ఎకరాలు వడిగేపల్లిపంచాయతీ పులగూర్లపల్లిలో అన్నదమ్ములకు ఉందన్నారు. నలుగురు అన్నదమ్ములు చెరో రెండెకరాలుచొప్పున భాగాలు చేసుకున్నామన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన వీఆర్‌ఓ సోమశేఖర్‌నాయక్ సోమందేపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడన్నారు. తాము భూములు అమ్ముకోవడానికి చేస్తున్న ప్రయ త్నం సందర్భంగా అతను జోక్యం చేసుకుని అమ్మిస్తానన్నాడు. అన్న పెద్దనారాయణప్ప, తమ్ముడు చిన్ననారాయణప్పలతో కలిసి ఆరెకరాలు అమ్మి ఇవ్వాలని చెప్పామన్నారు. బెంగళూరుకు చెందిన కొందరు వ్యక్తులకు ఎకరా రూ. 75లక్షలు చొప్పున అమ్మినట్లు తెలిపారు. గతనెల 25న భూముల అమ్మకాల రిజిస్ర్టేషన పెనుకొండలో జరిగిందన్నారు. ఎకరాకు రూ.75లక్షలు, రెండెకరాలకు రూ.1.50కోట్లు చెల్లించి తనకు మాత్రం రూ.71లక్షలతో రూ.1.25కోట్లు ఇ చ్చి రూ.25లక్షలు తనవద్ద ఉంచుకున్నట్లు తెలిపారు. నెలరోజుల నుంచి అ దిగో ఇదిగో అంటూ చెప్పి ఫోన ఎత్తడం మానేశాడన్నారు. ఇంటివద్ద అందుబాటులో ఉండటంలేదన్నారు. చివరకు డబ్బు ఇచ్చేది లేదు ఏం చేసుకుంటారో చేసుకోండని చెప్పడం కన్నీటి పర్యంతమయ్యారు. గోరంట్ల తహసీల్దార్ మారుతి, సోమందేపల్లి ఇనచార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఇక్కడికి వచ్చామన్నారు. ఇతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. దీనిపై ఇనచార్జి తహసీల్దార్‌ను వివరణ కోరగా సంఘటనపై పూర్తీస్థాయిలో విచారణ చేస్తామన్నారు. తప్పుచేసినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.