Share News

VIGILENCE: సిమెంటు గోడౌనపై విజిలెన్స అధికారుల దాడి

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:34 AM

మండలపరిధిలోని గుత్తివారిపల్లి వద్దనున్న సాగర్‌ సిమెంటు గోడౌనపై విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడిచేసి గోడౌనను సీజ్‌ చేశారు. గుత్తివారిపల్లి వద్ద కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన మహేష్‌ అనే వ్యక్తి సాగర్‌ అనే సిమెంట్‌ ఫ్యాక్టరీ ద్వారా దిగుమతులు, ఎగుమతులు సాగిస్తున్నారు.

VIGILENCE: సిమెంటు గోడౌనపై విజిలెన్స అధికారుల దాడి
Officials seizing the warehouse

గోరంట్ల, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని గుత్తివారిపల్లి వద్దనున్న సాగర్‌ సిమెంటు గోడౌనపై విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడిచేసి గోడౌనను సీజ్‌ చేశారు. గుత్తివారిపల్లి వద్ద కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన మహేష్‌ అనే వ్యక్తి సాగర్‌ అనే సిమెంట్‌ ఫ్యాక్టరీ ద్వారా దిగుమతులు, ఎగుమతులు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా సిమెంటును గుత్తివారిపల్లి గోడౌనకు తరలిస్తున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలో అక్రమంగా తయారు చేయించిన వివిధరకాల బ్రాండ్ల ఖాళీ సంచుల్లో సిమెంటును నింపి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. డిమాండ్‌ ఉన్న బ్రాండ్‌ను బట్టి ఒకేరకం సిమెంటును వివిధ బ్రాండ్ల పేరుతో ఆయా సంచుల్లో తరలించడం ద్వారా అక్రమ సంపాదన సాగిస్తున్నారు. విజిలెన్స ఎనఫోర్సుమెంటు అధికారి వీబీపీటీఏ ప్రసాద్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం గుత్తివారిపల్లి సిమెంటు ఫ్యాక్టరీపై దాడిచేశారు. లారీలోని 338 సిమెంటు బస్తాలను, ఖాళీగా ఉన్న 88 అల్ర్టాటెక్స్‌ సంచులను సీజ్‌ చేశారు. అక్రమాలు వెలుగు చూడడంతో సాగర్‌ సిమెంటు ఫ్యాక్టరీని సీజ్‌ చేశారు. దాడిలో విజిలెన్స డీఎస్పీ నాగభూషణ, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ గోపాల్‌, అల్ర్టాటెక్‌ కంపెనీ సిబ్బంది, జీఎస్టీ సిబ్బంది, బూదిలి, నార్సింపల్లి వీఆర్‌ఓలు సల్మాన, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:34 AM