Share News

POLAM PILUSTHONDI : సర్యరక్షణ చర్యలు పాటించాలి

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:17 AM

కాయదశలో ఉన్న కందిపంటకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో విజయభారతి తెలిపారు. మంగళవారం సూచించారు. కేతగానిచెరువు, రెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.

POLAM PILUSTHONDI : సర్యరక్షణ చర్యలు పాటించాలి
AO Vijayabharati giving suggestions to farmers

సోమందేపల్లి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కాయదశలో ఉన్న కందిపంటకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో విజయభారతి తెలిపారు. మంగళవారం సూచించారు. కేతగానిచెరువు, రెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతుల పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కాయ దశలో కాయతొలుచు పురుగు, మచ్చలపురుగు ఆశిస్తాయన్నారు. దీనికోసం రైతులు మందులు వాడాలన్నారు. వీఈఓ అలేఖ్య, రైతులు పాల్గొన్నారు.

పెనుకొండ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుట్టూరు, చిన్నపరెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం వ్యవసాయాధికారులు నిర్వహించారు. వ్యవసాయాధికారి చందన మాట్లాడుతూ రాగి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పండించే రైతులు ఎరువులు, మందులు సకాలంలో పిచికారి చేసుకోవాలన్నారు. రబీ సీజనలో చియాసీడ్స్‌ పంట సాగు చేయడంవల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వ్యవసాయాధికారులు, మాజీ ఎంపీపీ చిన్నవెంటకరాముడు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 12:17 AM