Home » Peddapalli
పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. తొలి విడతలో 122 గ్రామ పంచాయతీలు, 1,172 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు రాత్రి వరకు 773 నామినేషన్లు రాగా వార్డులకు 2,243 వచ్చాయి.
పల్లె ఎన్నికలు జోరందుకున్నాయి. సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ముగిసి పోయింది. ఉపసంహారణలు, ఏకగ్రీవాల కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా మరోవైపు ప్రచారంలోకి అభ్య ర్థులు ఆడుగుపెడుతున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానా లకు పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొన్నది. బీసీలు, జనరల్‌కు కేటాయించిన సర్పంచ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది.
ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం గోదావరిఖని ప్రభు త్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల మను గడ ప్రశ్నార్థకమవుతోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలం గాణ విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనై జింగ్ సెక్రెటరీ డాక్టర్ లక్ష్మీనారాయణ, రఘుశంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతీ రైతుకు అవసరమైన యూరియా అందేలా పక్కా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం బ్రాహ్మణపల్లి రైతువేదిక వద్ద యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్‌పై ఎరువుల డీలర్లకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ చరిత్ర ఉంటుందని, ఉద్య మకారులపై గన్ ఎక్కు పెట్టిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదని, ఉద్యమంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎక్కడ ఉన్నాడోనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శనివారం పెద్దపల్లిలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రామగుం డం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం ముట్టడికి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునివ్వడంతో మంగళ వారం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చందర్‌తో పాటు పలువురు నాయకులు మంగళవారం ఉదయమే కళ్యాణ్‌నగర్ చౌరస్తా వద్ద వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు.
రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో మంగళవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
బాలికల విద్య ద్వారనే మహిళా సాధికా రతను సాధించవచ్చని జిల్లా మహిళా సాధికా రిత కేంద్రం సమన్వయకర్త డా. దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జాబు సుచరిత అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై మం గళవారం మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అవగాహన కల్పించారు.