Share News

రామగుండంలో స్వల్పంగా లాఠీచార్జి

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:19 AM

రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. రెండుమూడు చోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఏసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రామగుండంలో స్వల్పంగా లాఠీచార్జి

కోల్‌సిటీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. రెండుమూడు చోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఏసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వన్‌టౌన్‌ పరిధిలో సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లు ఉన్న చోట పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది ఉదయం నుంచే పెట్రోలింగ్‌ చేస్తూ ట్రబుల్‌ మాంగర్స్‌పై నిఘా పెట్టారు. ఎన్‌టీఆర్‌నగర్‌, గంగానగర్‌ పోలీస్‌ స్టేషన్ల వద్ద స్వల్ప వివాదాలు తలెత్తాయి. యైుటింక్లయిన్‌కాలనీలోని 17వ డివిజన్‌ పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన నిర్వహించారు.

స్థానిక 57వ డివిజన్‌ పరిధిలోని ఎన్‌టీఆర్‌ నగర్‌లో ఓటరు స్లిప్పులు రాయడంలో ఆర్‌పీలు వివక్ష ప్రదర్శిస్తున్నారని, దొంగ ఓట్లు వేస్తున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి గుండు రాజుతో పాటు జిమ్మిబాబు, మరికొందరు వివాదం రేపడంతో ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గంగానగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఫార్వర్డ్‌బాక్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. జనం గుమిగూడడంతో పోలీసులు చెదరగొట్టారు.

Updated Date - Feb 12 , 2026 | 12:19 AM