ప్రశాంత ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:57 PM
రామగుండం కార్పొ రేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రజలు ఓటు హక్కు వినియోగిం చుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి సూచిం చారు.
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొ రేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రజలు ఓటు హక్కు వినియోగిం చుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి సూచిం చారు. గోదావరిఖనిలో ఎన్నికల విధులకు హాజ రవుతున్న అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బ్యాలెట్ బాక్స్‌లు స్ర్టాంగ్ రూమ్‌లకు చేరే వరకు అప్ర మత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్ పరి ధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన ఉండి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఏసీపీ రమేష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్ స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్ కుమార్, ప్రసా ద్‌రావు, రాజేశ్వర్‌రావు ఎస్‌ఐలు, సిబ్బందికి విధులు కేటాయించారు.
సుల్తానాబాద్ : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల విధులలో నియమితులైన పోలీసు అధికారులకు సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. డీసీపీ మాట్లాడుతు పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు వారి పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలని, ఎన్నికల కమిషన్ అధేశాలను పాటించాలన్నారు. పోలీసు బందోబస్తుతో పాటు అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద విఽధులు నిర్వహించే అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పద్దపల్లి ఏసీపీ గజ్జి క్రిష్ణ, సుల్తానాబాద్ సీఐ జి సుబ్బారెడ్డి,ఎస్‌ఐ చంద్రకుమార్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.