Share News

చివరి రోజు... ప్రచారం జోరు..

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:38 AM

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. నిన్న మొన్నటి వరకు గల్లీల్లో వినిపించిన మైకులు మూగబో యాయి. చివరి రోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

 చివరి రోజు...   ప్రచారం జోరు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. నిన్న మొన్నటి వరకు గల్లీల్లో వినిపించిన మైకులు మూగబో యాయి. చివరి రోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తమ బలాబలాలను ప్రదర్శించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు జన సమీకరణ చేసి జోరుగా ప్రచారం చేశారు. మోటార్‌ సైకిళ్ల ర్యాలీతో పాటు, పాదయాత్రగా పోటీ చేసే డివి జన్లు, వార్డుల్లో మరోసారి తిరిగి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని పట్టణాల్లో కాంగ్రెస్‌,. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థుల తరపున సభలు, సమావేశాలు నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో ఒకటి ఏకగ్రీ వం కాగా, 59లో 315 మంది అభ్యర్థులు, పెద్దపల్లిలోని 36 వార్డుల్లో 157 మంది, సుల్తానాబాద్‌లో 15 వార్డుల్లో 61 మంది, మంథనిలోని 13 వార్డుల్లో 48 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

పోటాపోటీగా ప్రచారం..

రామగుండంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి పలు కార్నర్‌ మీటింగ్‌ల్లో పాల్గొని మాకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులతోనే పోటీ అని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మంథని పట్ట ణంలోని పలు వార్డుల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓటర్లు కలిసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో పాల్గొని జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌ సభ మూడు మున్సిపాలిటీల్లో ప్రజల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగుర వేస్తున్నామన్నారు. బీఆర్‌ ఎస్‌, బీజేపీ రెండు ఒక్కటేనని, పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించాలని పన్నుతున్న కుట్రలను ప్రజలు గమని స్తున్నారని అన్నారు. పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు. సుల్తానాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే విజయరమ ణారావు పూసాల నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున మోటార్‌ సైకిళ్ల ర్యాలీ నిర్వహించి ప్రజలను ఉద్ధేశించి ప్రసం గించారు. రామగుండంలో రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ సైతం ముమ్మ రంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, పుట్ట మధూకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, తదితరులు ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌ కుమార్‌, తదితరులు జోరుగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వ హించారు. అభ్యర్థులు పోటాపోటీగా జనసమీకరణ చేసి ప్రచారం చేశారు.

ప్రలోభాలు షురూ...

ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో సాయంత్రం ప్రలోభాలకు తెర లేపారు. ఆరు రోజుల నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు కుల సంఘాలు, అసోసియేషన్లు, యువజన సంఘాల వారీగా మద్యంతో దావత్‌లు నిర్వహించారు. మహిళా ఓటర్లకు 300 నుంచి 500 రూపాయల వరకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించారు. ప్రచారం ముగియడంతో ఒక్కో అభ్యర్థి 2 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ముందస్తుగా మద్యం కొనుగోలు చేసి ఇంటింటికి ఓటర్లకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఓటుకు నోట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రత్యర్థులను బట్టి ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు ఓట్లు పంపిణీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. కొందరు అభ్యర్థులు మహిళలకు చీరలు, కిచెన్‌ వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బులు, మద్యం పం పిణీ వల్ల ఏ అభ్యర్థి గెలుస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడుతున్నది. డబ్బుల పంపిణీతో కుటుంబాల్లో ఓట్లు కూడా చీలే ప్రమాదమేర్పడింది.

Updated Date - Feb 10 , 2026 | 01:38 AM