సమ్మెకు దూరంగా ఉండండి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:58 PM
కార్మిక సంఘాలు ఈ నెల 12న తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్జీ-3, ఏపిఏ జీఎం మధుసూ దన్, నాగేశ్వర్‌రావు కోరారు. మంగళవారం జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు.
రామగిరి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కార్మిక సంఘాలు ఈ నెల 12న తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్జీ-3, ఏపిఏ జీఎం మధుసూ దన్, నాగేశ్వర్‌రావు కోరారు. మంగళవారం జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ సమ్మె డిమాండ్స్‌లలో అత్యధికంగా సింగరేణి ఉద్యో గులకు సంబంధించినవి కావని పేర్కోన్నారు. సమ్మె లో పాల్గొని తమ వేతనాలను కోల్పోవద్దని సూచిం చారు. అధికారులు సుధాకర్, రామ్మోహన్, సత్యనా రాయణ, రాజశేఖర్, కాశీవిశ్వేశ్వర్‌రావు, మురళీ, రాజేంద్రకుమార్, ఉదయ్, సురేఖ, కళ్యాణ చక్రవర్తి, షబ్బీరుద్దీన్, పాపయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు.
కార్మిక సంఘాలతో అధికారుల చర్చలు
గోదావరిఖని, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదిన తల పెట్టిన ఒక రోజు సమ్మె గురించి వివిధ యూనియన్ సంఘా లతో, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ మంగళవారం జీఎం కార్యాల యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదిన తల పెట్టిన ఒక రోజు సమ్మెకు సంబంధించి ఏ అంశం కూడా సింగరేణి పరిధిలో లేనివని, సమ్మె ఆలోచన విరమించి విధులకు హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.