కల్వర్టులకు మరమ్మతు చేయండి
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:22 AM
శిథి లావస్థలో ఉన్న ఎస్సారెస్పీ కల్వర్టులకు మర మ్మతు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం గుండారం గ్రామపంచాయతీ పరి ధిలోని రాజాపూర్ రహదారిలోని ఎస్సారెస్పీ కాలువపై కల్వర్టు చెడిపోయి ప్రమాదకరంగా మారింది.
కమాన్‌పూర్,ఫిబ్రవరి11(ఆంధ్రజ్యోతి): శిథి లావస్థలో ఉన్న ఎస్సారెస్పీ కల్వర్టులకు మర మ్మతు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం గుండారం గ్రామపంచాయతీ పరి ధిలోని రాజాపూర్ రహదారిలోని ఎస్సారెస్పీ కాలువపై కల్వర్టు చెడిపోయి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కెనాల్‌లో పడి పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుండారం ఉపసర్పంచ్ అంబిరి రాజేందర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కెనాల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ ఈఈ బలరామయ్యకు ఫోన్‌లో మాట్లాడి మర మ్మతు అంచనా వేసి వివరాలను పంపాలని సూచించారు. రాజాపూర్, గుండారం రిజర్వా యర్ వెళ్లేదారిలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద గల కెనాల్ గల కల్వర్టు, రాజేంద్రనగర్ ఐకేపీసెంటర్ వద్ద కల్వర్టు చెడిపోయి ప్రమా దకరంగా మారిందని, ఎస్టీమేట్ చేసి పంపిం చాలని ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్ రంగు సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపీపీ కోలేటి మారుతి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు, గుండారం మాజీ సర్పంచ్‌లు ఆకుల ఓదెలు, అడబాల చంద్రయ్య, నాయకులు కృష్ణమూర్తి, పిడుగు శంకర్, సదయ్య, వడ్లకొండ శంకర్, ఆకుల రాజయ్య, సయ్యద్ ఇస్మాయిల్, ఉన్నారు.
ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో తమ ను వెన్నుపోటు పొడిచారని గుండా రం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్య క్షుడు పిడుగు శంకర్, మాజీ సర్పం చ్‌లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ మరో పార్టీకి మద్దతు పలికి తమ ఓటమికి కారకు లయ్యారని శంకర్ మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి అలాంటి వారిపై విచారణ జరుపుతానని, చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.