Share News

బ్యాంకు లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:21 AM

ప్రతి ఒక్కరూ బ్యాంకు లావా దేవీలపై కనీస అవగాహన కలిగి ఉండాలని యూనియన్‌ బ్యాంక్‌ బేగం పేట్‌ ఎక్స్‌రోడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ గోపికృష్ణ సూచించారు. బుధవారం లక్కారం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.

బ్యాంకు లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలి

ముత్తారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ బ్యాంకు లావా దేవీలపై కనీస అవగాహన కలిగి ఉండాలని యూనియన్‌ బ్యాంక్‌ బేగం పేట్‌ ఎక్స్‌రోడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ గోపికృష్ణ సూచించారు. బుధవారం లక్కారం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతీ ఖాతాదా రుడు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌, పాన్‌ కార్డులను అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఆర్థిక భరోసా కోసం ఇన్సూరెన్స్‌ ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రజలందరూ బీమా చేయించుకోవాలని అవగాహన కల్పిం చారు. సర్పంచ్‌ అత్తే చంద్రమౌళి మాట్లాడుతూ, బ్యాంకులు కల్పిస్తున్న ఇలాంటి అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప సర్పంచ్‌ చల్లూరి రాజకుమార్‌, బ్యాంకు సిబ్బంది సదానందం, అశోక్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:21 AM