బ్యాలెట్ బాక్స్‌ల్లో అభ్యర్థుల భవితవ్యం
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:17 AM
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో బుధవారం పోలింగ్ ముగి సింది. బ్యాలెట్ బాక్స్‌లను స్ర్టాంగ్ రూంలకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం బాక్స్‌లో భద్రంగా ఉంది. ఈనెల 13న జరగనున్న కౌంటింగ్‌లో గెలుపెవరిదో తేలనుంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో బుధవారం పోలింగ్ ముగి సింది. బ్యాలెట్ బాక్స్‌లను స్ర్టాంగ్ రూంలకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం బాక్స్‌లో భద్రంగా ఉంది. ఈనెల 13న జరగనున్న కౌంటింగ్‌లో గెలుపెవరిదో తేలనుంది. మున్సి పల్ ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు కనబడుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందగా, 2024 జూన్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థికే పట్టం కట్టారు. 15 రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ 262 పంచాయతీ లకుగాను 183 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. ఇదే ట్రెండ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనబడుతోంది. జిలా ్లలో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద ్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జనవరి 27న విడుదల చేసి ఆ మరుసటి రోజు నుంచే నామినేషన్లు స్వీకరించారు. దీంతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు అవకా శాలు లేకుండా పోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సైతం అభ్య ర్థులను ఎంపిక చేయడంలో ఆలస్యం చేశారు. 2, 3వ తేదీల్లో అభ్యర్థులకు బీ ఫారాలు అంద జేశారు. ప్రచారానికి కూడా గతంలో కంటే ఈసారి తక్కువ సమయం ఇవ్వడంతో కాం గ్రెస్ పార్టీ నాయకులు తమకు అనుకూ లంగా మలుచుకున్నారు.
ఈ నాలుగింటిలో కాంగ్రెస్ జెండా ఎగరే యాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. ఇంటింటికి తిరుగుతూ, కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి, జరుగుతున్న పనులు, సంక్షేమ పథ కాల అమలు గురించి ప్రచారం చేశారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా, ఒకటవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం 59 డివిజన్లకు పోలింగ్ జరగగా, పోలింగ్ సరళిని చూస్తే కాంగ్రెస్ పార్టీ 34 నుంచి 36 డివిజన్లలో గెలిచే అవకాశాలు న్నా యి. బీఆర్‌ఎస్ 10 నుంచి 12, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 5 నుంచి 7 డివిజన్లు, బీజే పీ 2 నుంచి 4, స్వతంత్రులు ఒకరిద్దరు గెలిచే అవకాశాలున్నాయి.
పెద్దపల్లి మున్సి పాలిటీలో 36 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 27 నుంచి 30 వరకు, బీఆర్‌ఎస్ 3 నుంచి 5, బీజేపీ 2, ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 2 వార్డుల్లో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 11 వార్డులు, బీఆర్‌ఎస్ ఒకటి నుంచి 2 వార్డులు, బీజేపీ రెండింటిలో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక వార్డులో గెలిచే అవకాశాలున్నాయి.
మంథని మున్సిపాలిటీలో 13 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 వార్డు, బీఆర్‌ఎస్ పార్టీ ఒకటి నుంచి రెండు వార్డులు, బీజేపీ ఒక వార్డులో గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొత్తంమీద ఇతర పార్టీల నుంచి గెలుపొందే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మద్దతు అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు.