• Home » Peddapalli

Peddapalli

   ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

ప్రజాభిప్రా య సేకరణలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్క రిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పర్యా వరణ ప్రజాభి ప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు.

‘ఉపాధి’ దూరం చేసే బిల్లును రద్దు చేయాలి

‘ఉపాధి’ దూరం చేసే బిల్లును రద్దు చేయాలి

గ్రామీణ పేదల జీవనోపాధిని దూరం చేసే వీబీజీ రామ్‌జీ బిల్లును రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాకయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిల్లు ప్రతులను దహనం చేశారు.

బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకించండి

బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకించండి

సింగరేణిలో బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకించాలని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో బొగ్గు గనుల వేలం పాట వేయకుండా అడ్డుకొన్నామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత గుర్తింపు సం ఘం ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు సిం గరేణి యాజమాన్యంతో కలిసి ప్రభుత్వం వద్దకు వెళ్లి సింగరేణిలో బొగ్గు గనులకు వేలం పాటలకు అనుమతి ఇవ్వాలని చెప్పడం దుర్మార్గమన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

రామగుండం లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం రామగుండం కార్పొరేషన్‌లో ఆయన విస్తృత పర్యటన చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాం గణంలో జరుగుతున్న పనులు, శ్మశానవాటిక, అశోక్‌న గర్‌లోని గర్ల్స్‌ హైస్కూల్‌, గౌతమినగర్‌లోని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రామగుండంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులను కలెక్టర్‌ పరిశీలించారు.

బుధవారంపేట్‌ గ్రామస్తుల ధర్నా

బుధవారంపేట్‌ గ్రామస్తుల ధర్నా

వ్యవసాయ భూములు మాత్రమే స్వాధీనం చేసుకుంటామంటే ఊరుకోనేది లేదని పూర్తి గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బుధవారంపేట్‌ గ్రామస్థులు అధికారులను అడ్డుకొని ధర్నా చేపట్టారు. సింగరేణి ఓసీపీ-2 విస్తరణ పనుల కోసం సింగరేణి యాజమాన్యం కేవలం భూములనే స్వాధీనం చేసుకుంటే తాము సహించేది లేదని ధర్నా చేపట్టారు.

టీఎస్‌టీపీపీ స్టేజ్‌ 2పై ఎన్టీపీసీ మల్లగుల్లాలు..!

టీఎస్‌టీపీపీ స్టేజ్‌ 2పై ఎన్టీపీసీ మల్లగుల్లాలు..!

తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) స్టేజ్‌ 2 నిర్మాణం విషయంలో ఎన్టీపీసీ మల్లగుల్లాలు పడుతున్నది. రెండో దశలో నిర్మించాల్సిన 800 మెగావాట్ల మూడు యూనిట్ల విషయంలో కీలకమైన పర్యావరణ అనుమతి రెండు నెలల క్రితమే లభించింది. అయితే ప్రాజెక్టు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదరడం లేదు.

అభివృద్ధి చూడలేకనే అసత్య ఆరోపణలు

అభివృద్ధి చూడలేకనే అసత్య ఆరోపణలు

రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు గట్ల రమేష్‌, పెద్దెల్లి ప్రకాష్‌ ఆరోపించారు.

ఉపాధిహామీకి మహాత్మ గాంధీ పేరును తొలగింపు

ఉపాధిహామీకి మహాత్మ గాంధీ పేరును తొలగింపు

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు దాసరి విజయ్‌ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

రామగుండం కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ హెచ్చరించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాం

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాం

జిల్లాలో నిర్వహించిన మూడో విడత ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించా మని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఋధవారం కలెక్టర్‌ ఓదెల మండలం కొలనూరు జెడ్పీహెచ్‌ఎస్‌, పెద్దపల్లి మండ లం పెద్దకల్వల మండల పరిషత్‌ ప్రాథమికో న్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి