Home » Operation Sindoor
పాక్ గూఢచర్యం కేసులో పట్టుబడ్డ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు 2,500 పేజీల ఛార్జ్ షీటును దాఖలు చేశారు. ఆమె గూఢచర్యానికి పాల్పడిందనేందుకు గట్టి ఆధారాలు లభించాయని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు, అసమాన శౌర్యపరాక్రమాలు ప్రదర్శించిన 16 మంది సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎఫ్) జవాన్లకు శౌర్య పతకాలు లభించాయి.
డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న భారత్ వ్యతిరేక చేష్టలు తారాస్థాయికి చేరుతున్నాయి. తనకు తాను 'శాంతి దూత'గా పదే పదే చెప్పుకుంటున్న ట్రంప్.. ఇప్పుడు భారత్ పై విషం కక్కుతూ, మన దాయాది దేశాలైన చైనా, పాకిస్థాన్ లపై విపరీతమైన ప్రేమ ఒలకబోస్తూ ఆయా దేశాల్ని దువ్వుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.
ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య రేపు, ఎల్లుండి(ఆగష్టు 11, 12 తేదీల్లో) ఆరేబియా సముద్రంలో నావికాదళ విన్యాసాలు జరుగనున్నాయి. దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాలు తమ శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శిస్తుండటం విశ్లేషకులలో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ ఎటాక్ ఎలా జరిగిందో తెలుసా. మొదటిసారిగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీని గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్..
Air chief marshal AP Singh: పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదు జెట్లను మాత్రమే కాకుండా.. ఓ భారీ ‘ఎయిర్‌బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్’ను కూడా కూల్చేశామన్నారు.
అమెరికా అధ్యక్షుడు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.
ఆపరేష్ సిందూర్‌పై పార్లమెంటులో విపక్షాలు ప్రశ్నలు లేవెనత్తి తమకు తామే హాని చేసుకున్నాయని ప్రధాని విమర్శించారు. ఇలాంటి మరిన్ని డిబేట్లకు వాళ్లు డిమాండ్ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.