Operation Sindoor Included in NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో సిందూర్
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:11 AM
ఉగ్రవాదంపై యుద్ధం చేసిన ఆపరేషన్ సిందూర్‌ను ఎన్‌సీఈఆర్‌టీ తాజా పుస్తకాల్లో పాఠాలుగా పొందుపరిచింది....
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఉగ్రవాదంపై యుద్ధం చేసిన ఆపరేషన్ సిందూర్‌ను ఎన్‌సీఈఆర్‌టీ తాజా పుస్తకాల్లో పాఠాలుగా పొందుపరిచింది. రెండు అనుబంధ పుస్తకాలను రూపొందించి 3 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠాలుగా నిర్ణయించింది. దీనిని కేవలం ఉగ్రవాదానికి సైన్యం స్పందనగా మాత్రమే చూడకుండా, శాంతి పరిరక్షణ కోసం చేసే ప్రతిజ్ఞగా పాఠాలు రూపొందించింది. పహల్గాంలో జరిగిన దాడిలో బాధితులైన వారికి గౌరవం కలిగించేలా చూడడం కూడా మరో ఆశయం. పాకిస్థాన్ మిలటరీ, రాజకీయ నాయకత్వం ప్రత్యక్షంగా ఇచ్చిన ఆదేశాల మేరకే పహల్గాం దాడులు జరిగినట్టు పాఠాల్లో పేర్కొంది.