Operation Abhyas Live Updates: సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..
ABN , First Publish Date - May 07 , 2025 | 08:25 AM
Operation Sindoor Live Updates in Telugu: భారత పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర మూకల అంతు చూసింది భారత సైన్యం. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో త్రివిధ దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిభిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతయ్యారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
May 07, 2025 21:28 IST
రేపు భారీ ర్యాలీ..
హైదరాబాద్: భద్రతా బలగాలకు సంఘీభావంగా రేపు ర్యాలీ
రేపు సా.6 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ర్యాలీ, పాల్గొననున్న సీఎం రేవంత్
తెలంగాణ సచివాలయం నుంచి నెక్లెస్‌రోడ్ వరకు ర్యాలీ
-
May 07, 2025 20:36 IST
ఆపరేషన్ సిందూర్.. సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష..
హైదరాబాద్: సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కీలక సమీక్ష
ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పరిస్థితులపై చర్చ
ఉన్నతాధికారులకు రేవంత్, భట్టి కీలక సూచనలు
తెలంగాణలో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు
అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు
అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆదేశాలు
ఎయిర్‌పోర్టు, విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రత పెంచాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశం
భారత సైన్యానికి మద్దతు ఇవ్వాలని యువతకు పిలుపు
కేంద్ర రక్షణ రంగ సంస్ధల దగ్గర మరింత భద్రత పెంచాలని సీఎం రేవంత్ ఆదేశం
అత్యవసర పరిస్థితి ఎదురైతే నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు
తక్షణ నిర్ణయాలకు వీలుగా 24/7 అందుబాటులో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
రేపు ర్యాలీలో పాల్గొనాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
-
May 07, 2025 20:35 IST
హతమైన మావోలు వీరే..
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్
ఏపీ గ్రేహౌండ్స్ బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి
మృతుల్లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు పోడియామి, కాకూరి
సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు కాకూరిపై రూ.20 లక్షల రివార్డు
మావోయిస్టు పార్టీ డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యుడు వాగ పోడియామిపై రూ.8లక్షల రివార్డు
మృతుల నుంచి అధునాతన ఆయుధాలు, 2 AK-47 తుపాకులు స్వాధీనం
-
May 07, 2025 20:10 IST
ఆ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ..
IAS అధికారుల కమిటీతో ముగిసిన తెలంగాణ ఉద్యోగ సంఘాల భేటీ
కమిటీ ఎదుట 57 డిమాండ్లు పెట్టిన ఉద్యోగ సంఘాలు
పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి: ఉద్యోగ సంఘాలు
EHS అమలు చేయాలి: తెలంగాణ ఉద్యోగ సంఘాలు
PRC-2020 బిల్లులు ఆర్థిక శాఖ ద్వారా కాకుండా ట్రెజరీ ద్వారా అడ్మిట్ చేసే అవకాశం ఇవ్వాలి: ఉద్యోగ సంఘాలు
టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేయాలి: ఉద్యోగ సంఘాలు
ఉద్యోగుల అన్ని డిమాండ్లు నోట్ చేసుకున్న అధికారుల కమిటీ
ఉద్యోగుల సమస్యలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మరో సమావేశం నిర్వహిస్తామన్న IAS అధికారుల కమిటీ
-
May 07, 2025 20:09 IST
ఉగ్రదాడి.. సమాచారం చెప్పండి: ఎన్ఐఏ
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి సమాచారంపై ఎన్ఐఏ కీలక విజ్ఞప్తి
ఉగ్రదాడి గురించి చెప్పాలని పర్యాటకులు, స్థానికులను కోరిన ఎన్ఐఏ
సమాచారం తెలిస్తే 9654958816, 011 24368800 నంబర్లకు పంపాలన్న ఎన్ఐఏ
-
May 07, 2025 18:13 IST
NSA Ajit Doval briefs counterparts: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని 9 ప్రదేశాలలో ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలపై కేంద్రీకృత దాడులు జరిగిన తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పలు దేశాల NSAలతో మాట్లాడారు.
-
May 07, 2025 18:04 IST
సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..
అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
హాజరైన సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా..
ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్హా, అగ్నిమాపక శాఖ డీజీ, ఉన్నతాధికారులు
సివిల్ డిఫెన్స్ సన్నద్ధతపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ
ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా..
ప్రజలను సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశం
తీరప్రాంత భద్రతపై దృష్టి పెట్టాలని మెరైన్ పోలీసులకు ఆదేశాలు
నౌకాదళం, కోస్టుగార్డు, ఇతర రక్షణ దళాలతో..
సమాచారం పంచుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
-
May 07, 2025 18:03 IST
చైనా ద్వంద వైఖరి..
ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్న చైనా
ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన భారత్
ఇరు దేశాలు సమన్వయం పాటించాలంటూ ప్రకటన
రెండు దేశాలు చాలా ముఖ్యమంటున్న చైనా
పాక్ మంత్రులతో చైనా రాయబారుల చర్చలు
చైనా పాక్‌కు మద్దతిస్తున్నారని భారత్ అనుమానం
చైనా మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు
-
May 07, 2025 18:03 IST
ఉగ్రవాదులతో పాకిస్థాన్‌కు సంబంధాలు
ఆపరేషన్ సిందూర్‌లో గాయపడ్డ ఉగ్రవాదులను ఆస్పత్రిలో పరామర్శించిన పాక్ ఆర్మీ ప్రతినిధులు
మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు
పక్కాగా వీడియోల్లో కనిపిస్తున్న పాక్ ఆర్మీ
పాకిస్థాన్ వైఖరిపై మండిపడుతున్న భారత్
-
May 07, 2025 17:56 IST
రెచ్చిపోతున్న పాక్ సైన్యం..
జమ్మూకశ్మీర్: LoC దగ్గర పాక్ సైన్యం కాల్పులు
పాక్ సైన్యం కాల్పుల్లో ఇప్పటి వరకు..
15 మంది పౌరులు మృతి, 43 మందికి గాయాలు
పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో గత రాత్రి నుంచి కాల్పులు
సాధారణ నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు
-
May 07, 2025 17:37 IST
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)తో పహల్గాం ఉగ్రదాడిలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా చంపిన వారికి గట్టి సమాధానమిచ్చామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టామని, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత జాగరూకతతో ఈ దాడులు నిర్వహించామని చెప్పారు.
-
May 07, 2025 17:36 IST
Stock Markets Wednesday Closing: భారత స్టాక్ మార్కెట్ల దమ్మెంతో ప్రపంచానికి తెలిసొస్తోంది. ఆఖరికి పాకిస్థాన్ తో యుద్ధం మొదలుపెట్టినప్పటికీ కూడా ఇండియా మార్కెట్లు ఏ మాత్రం జంకలేకుండా తమ దమ్మెంతో చూపించాయి. అటు, ట్రంప్ టారిఫ్స్ పెడితే, యావత్ ప్రపంచం ఒణికిపోతే, ఇండియా మాత్రం ఏ మాత్రం తొణకలేదు.
-
May 07, 2025 17:34 IST
భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసి, ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్ (JM) ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడులు భారతదేశం ఉగ్రవాదంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టం చేశాయి.
-
May 07, 2025 16:59 IST
భారీ ఎన్‌కౌంటర్..
ఏఓబీలో ఎన్‌కౌంటర్
ఏపీ గ్రేహౌండ్స్ బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి
రెండు AK-47 తుపాకులు స్వాధీనం
-
May 07, 2025 16:54 IST
శత్రువుకు తగిన బుద్ధి చెప్పాం: రాజ్‌నాథ్ సింగ్
ప్రధాని మోదీ నాయకత్వంలో 'ఆపరేషన్ సిందూర్': రాజ్‌నాథ్
పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్‌నాథ్
శతృవుకు తగిన బుద్ధి చెప్పాం: రాజ్‌నాథ్ సింగ్
అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం: రాజ్‌నాథ్
అమాయకుల ప్రాణాలు తీసినవారు మూల్యం చెల్లించారు: రాజ్‌నాథ్
దేశ భద్రతకు హాని కలిగిస్తే సహించేది లేదు: రాజ్‌నాథ్
పౌరుల నివాసాలను టార్గెట్ చేయలేదు: రాజ్‌నాథ్ సింగ్
-
May 07, 2025 16:53 IST
హైదరాబాద్‌లో ముగిసిన సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్
ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సివిల్ మాక్ డ్రిల్
సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDO, మౌలాలిలోని NFC ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్
కేంద్రం ఆదేశాలతో 'ఆపరేషన్ అభ్యాస్': సీవీ ఆనంద్
2 నిమిషాలు సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశాం: సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్: సీవీ ఆనంద్
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాం: సీవీ ఆనంద్
-
May 07, 2025 16:52 IST
దూకుడు పెంచిన సిట్..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన సిట్
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు రాజ్ కసిరెడ్డి, చాణక్య, అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు
హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన సిట్
విచారణలో నిందితులు వెల్లడించిన సమాచారం ఆధారంగా సోదాలు
-
May 07, 2025 16:23 IST
మోగిన సైరన్లు..
హైదరాబాద్‌లో 4 ప్రాంతాల్లో మోగిన సైరన్లు
సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDO, మౌలాలిలోని NFC ప్రాంతాల్లో మాక్ డ్రిల్
విశాఖలో రెండు చోట్ల సివిల్ మాక్ డ్రిల్
వన్‌టౌన్ జాలరిపేట, ఆక్సిజన్ టవర్స్‌లో మాక్ డ్రిల్
-
May 07, 2025 16:22 IST
ప్రారంభమైన మాక్ డ్రిల్..
దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్
'ఆపరేషన్ అభ్యాస్' పేరిట మాక్ డ్రిల్
పాల్గొన్న NDRF, డిఫెన్స్, ఫైర్ సిబ్బంది
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంపై ప్రజలకు అవగాహన కోసం మాక్ డ్రిల్
-
May 07, 2025 12:33 IST
భారతీయుడిగా గర్విస్తున్నా: కేసీఆర్
భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా గర్వపడుతున్నానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఆపరేషన్ సింధూర్‌పై స్పందించిన కేసీఆర్.. ఆర్మీ శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి నష్టం అని పేర్కొన్నారు.
ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి.
భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ అన్నారు.
-
May 07, 2025 12:30 IST
భారత్ దాడిపై పాక్ పౌరులు ఏమంటున్నారంటే..
పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ అటాక్ చేయడంపై ఆ దేశ పౌరులు స్పందించారు. ‘4 డ్రోన్స్ వచ్చాయి. అంతటా భయాందోళనలు నెలకొన్నాయి.’ అని పాకిస్థాన్‌లోని మురేడ్కేలోని స్థానికులు చెబుతున్నారు. ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు. రాత్రి 12.45 గంటల ప్రాంతంలో మొదట ఒక డ్రోన్ వచ్చింది. ఆ తరువాత మరో మూడు డ్రోన్స్ వచ్చాయి. మసీదులపై దాడి చేశాయి. మొత్తం ధ్వంసమైపోయింది అని చెప్పుకొచ్చాడు.
-
May 07, 2025 12:21 IST
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం
GLEX-2025ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.
భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోంది.
మంగళ్‌యాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలు.
విజయవంతంగా నిర్వహించాం.
స్పేస్ అంటే భారత్‌కు ఒక అన్వేషణ, ఒక సాధికారత.
-
May 07, 2025 11:00 IST
పాక్‌లో ఉగ్రసంస్థలు ఉన్నాయని 2023లోనే ఐరాస దృష్టికి తీసుకెళ్లాం: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది.
ఇక ముందు కూడా ఉగ్రచర్యలను భారత్ ఉపేక్షించదు.
దాడులకు పాల్పడేవారిని కచ్చితంగా శిక్షిస్తాం.
9 శిబిరాలపై భారత్ దాడి చేసింది.
భారత్ చేసిన దాడి బాధ్యతాయుతమైనది.

-
May 07, 2025 10:58 IST
భారత్‌పై రానున్న రోజుల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఉగ్రసంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసింది.
పహల్గాం దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు.
భారత్ తన అధికారాన్ని ఉపయోగించి.. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.
పహల్గామ్ దాడిలో మరో కుట్ర కూడా ఉంది.
కశ్మీర్‌తో పాటు దేశంలో విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు.
కశ్మీర్‌ను గతేడాది 2.3కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు.
జమ్మూకశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతోంది.
పహల్గామ్ దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారు.
అందుకే ఉగ్రవాదులకు సరైనరీతిలో బుద్ధిచెప్పాం.

-
May 07, 2025 10:52 IST
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐరాస విఫలం: రక్షణశాఖ అధికారులు
TRF అనేది లష్కరే తొయిబాకు ఒక ముసుగు
నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని గుర్తించాం.
ఉగ్రసంస్థల కోసమే TRF పనిచేస్తోంది.
అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోంది.
ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్వర్గధామంగా మారింది.
-
May 07, 2025 10:51 IST
ఢిల్లీ: త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియా సమావేశం

ఆపరేషన్ సింధూర్‌పై రక్షణశాఖ అధికారుల ప్రెస్‌మీట్
పార్లమెంట్‌పై దాడి నుంచి పహల్గామ్ వరకు. 350 మంది పౌరులు మృతి చెందారు: రక్షణ అధికారులు
600 మందికి పైగా సైనికులు మృతిచెందారు.
ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ సింధూర్.
పహల్గామ్‌లో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారు.
25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ మృతిచెందారు.
పహల్గామ్ దాడి అత్యంత హేయమైనది.
ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి.
జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగం.
-
May 07, 2025 10:25 IST
హైదరాబాద్ : ఆపరేషన్ సింధూర్‌పై హర్షం వ్యక్తం చేస్తూ నగరంలో పలు ప్రాంతాల్లో సంబరాలు.
సరూర్ నగర్ చౌరస్తా వద్ద భారత సైనికులకు సెల్యూట్ చెబుతూ మద్దతు తెలిపిన స్థానికులు.
పాకిస్తాన్ జెండాలను కాల్చి టపాసులు పేల్చిన బిజెపి నేతలు.
జైహింద్, జై భారత్ మాతాకీ నినాదాలు.
పహల్గాం ఉగ్రవాద చర్యకు భారత ధీటైన సమాధానం చెప్పిందంటూ హర్షం.
-
May 07, 2025 10:09 IST
పాక్‌లో ఎమర్జెన్సీ ప్రకటన..
పాక్‌లో కీలక ఎయిర్ పోర్టులు మూసివేత.
పాకిస్థాన్ లో 48 గంటల పాటు ఎయిర్ పోర్టులు మూసివేత.
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ ప్రకటన.
-
May 07, 2025 10:09 IST
ఆపరేషన్ సింధూర్‌ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్ కార్యాచరణకు చివరి నిమిషంలో మోదీ గ్రీన్ సిగ్నల్.
అతి తక్కు వ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ ని పూర్తి చేసిన త్రివిధ దళాలు.
కొనసాగుతున్న ప్రధాని మోదీ, అజిత్ దోవల్ సమావేశం.
సమావేశంలో పాల్గొన త్రివిధ దళాల ఉన్నతాధికారులు.
10.30గంటలకు విలేకరుల సమావేశంలో ప్రకటించాల్సిన అంశాలపై ప్రధానితో మాట్లాడుతున్న అజిత్ దోవల్.
-
May 07, 2025 10:08 IST
జమ్మూకశ్మీర్: సరిహద్దు జిల్లాల పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఎల్జీ
సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని కలెక్టర్లకు ఆదేశం.
అవసరమైన ఆహారం, రవాణా సదుపాయాలు కల్పించాలి.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
-
May 07, 2025 10:07 IST
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: హోంమంత్రి అమిత్‌షా
భారత్‌పై దాడి చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతాం.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత బలగాలు 'ఆపరేషన్ సింధూర్' చేపట్టాయి.
ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నా.
-
May 07, 2025 10:02 IST
ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి తీరని నష్టం
'ఆపరేషన్ సింధూర్'తో పాకిస్థాన్‌కు తీరని నష్టం
పాక్‌కు అమెరికా ఇచ్చిన ఎఫ్-16, చైనా ఇచ్చిన జె-17 యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన రఫెల్.
భారత్ ఆకాశ్ మిస్సైల్‌ను అడ్డుకున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్.
ఆకాశ్ మిస్సైల్‌ను పాక్ అడ్డుకోలేదని స్పష్టం చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
-
May 07, 2025 10:01 IST
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
భారత్ చెక్‌పోస్టులు లక్ష్యంగా కాల్పులు జరుపుతున్న పాక్
పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది పౌరులు మృతి
కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా పాక్ కాల్పులు
యూరీ, కుప్వారా, రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో కాల్పులు
పాక్ రేంజర్ల కాల్పులను తిప్పికొడుతున్న భారత బలగాలు
భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి
-
May 07, 2025 09:58 IST
ఆపరేషన్ సింధూర్-2 కి సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ ప్రకటన
పాకిస్థాన్ ప్రతిదాడి చేస్తే 'ఆపరేషన్ సింధూర్-2 తప్పదు: ఆర్మీ
-
May 07, 2025 09:47 IST
ఆపరేషన్ సింధూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా

పహల్గాం ఘాతుకానికి పాల్పడిన పాక్‌కు భారత్.. ఆపరేషన్ సింధూర్‌తో గట్టి షాకిచ్చింది. అర్ధరాత్రి మిసైల్ దాడులతో పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను తుత్తునీయలు చేసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు చేసేందుకు భారత్ హామర్, స్కాల్ప్ మిసైళ్లను కూడా వాడినట్టు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ కిలిగిన ఈ దీర్ఘశ్రేణి మిసైల్స్‌తో..
-
May 07, 2025 09:43 IST
మోదీ పర్యవేక్షణలో అటాక్..

ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకూ సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా..
-
May 07, 2025 09:42 IST
పంజాబ్‌లో నేలకూలిన గుర్తు తెలియని విమానం
బఠిండా జిల్లా అక్లియన్ కలాన్ గ్రామంలో ఘటన
ఒకరు మృతి, 9 మందికి గాయాలైనట్టు సమాచారం
-
May 07, 2025 09:41 IST
ఉద్రిక్తంగా భారత్, పాక్ నియంత్రణ రేఖ ప్రాంతం..
భారత్ సరిహద్దు చెక్ పోస్టులు లక్ష్యంగా కాల్పులు జరుపుతున్న పాక్.
కశ్మీర్ సహా.. సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న పాక్ రేంజర్లు.
పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసినప్పటి నుంచి కాల్పులు మొదలు పెట్టిన పాక్.
సుమారు 8 మంది పౌరులు మరణించినట్లు అధికార వర్గాల వెల్లడి.
పలువురు సైనికులు కూడా గాయపడినట్లు వెల్లడి.
-
May 07, 2025 09:20 IST
ఉగ్రవాదుల స్థావరాల మీద భారత్ దాడులపై స్పందించిన ఐరాస
భారత్, పాక్ ఘర్షణను ప్రపంచం భరించలేదు.
రెండు దేశాలు సైనిక సంయమనం పాటించాలి.
-
May 07, 2025 09:09 IST
భారత్ ఏయే స్థావరాలపై దాడి చేసింది.. వాటి పూర్తి వివరాలివే..
-
May 07, 2025 09:04 IST
మరికాసేపట్లో ఇండియన్ ఆర్మీ ప్రెస్‌మీట్..
ఉదయం 10 గంటలకు ఇండియన్ ఆర్మీ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది.
ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఆర్మీ కీలక వివరాలను వెల్లడించనుంది.
-
May 07, 2025 09:00 IST
ఇండియన్ ఆర్మీకి అండగా నిలుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
భారతీయ పౌరుడిగా మన సాయుధ దళాలకు అండగా నిలుద్దాము.
పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయి.
దానికి సంఘీభావం తెలిపి ఐక్యతను చాటుదాం.
మనమందరం ఒకటేనని ఒకే గొంతుగా నినదిద్దాం.
-
May 07, 2025 08:57 IST
రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్
రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
బికనీర్, బార్మర్‌లలో పాఠశాలలు మూసివేశారు.
జోధ్‌పూర్ విమానాశ్రయం మూసివేశారు.
-
May 07, 2025 08:54 IST
సైన్యంతో పాటే మేమూ: స్టాలిన్
పాక్ ఉగ్ర స్థావరాలపై భారత త్రివిద దళాలు జరిపిన దాడికి యావత్ దేశం మద్ధతు తెలుపుతోంది. సైన్యానికి మద్దతుగా మేముంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆపరేషన్ సింధూర్‌పై స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యంతో తమిళనాడు ఉంటుందన్నారు. మన సైన్యంతో, మన దేశం కోసం తమిళనాడు దృఢ నిశ్చయంతో ఉంది అని స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
-
May 07, 2025 08:47 IST
మొత్తం నాశనం చేసేయండి: అసదుద్దీన్ ఒవైసీ
న్యూఢిల్లీ: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత త్రివిద దళాలు అర్థరాత్రి సమయంలో సైనిక చర్యకు దిగాయి. ఈ చర్యను ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. ఈ దాడులను ప్రశంసించారు. ఉగ్ర స్థావరాలను పూర్తిగా నాశనం చేయాలని భారత సాయుధ దళాలకు పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌కి ఇది పెద్ద గుణపాఠం కావాలని అన్నారు. మరో పహల్గాం ఘటన మళ్లీ జరుగకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జై హింద్ అంటూ అసదుద్దీన్ నినదించారు. ఈ మేరకు ఎంపీ ట్వీట్ చేశారు.
-
May 07, 2025 08:39 IST
ఆపరేషన్ సింధూర్‌పై రాహుల్ ఫస్ట్ రియాక్షన్.. జైహింద్ అంటూ..
-
May 07, 2025 08:36 IST
పహల్గాం బాధితుల రియాక్షన్ ఇదే..
-
May 07, 2025 08:32 IST
Operation Sindoor: భారత్ దాడులకు సంబంధించిన విజువల్స్..
-
May 07, 2025 08:25 IST
భారత పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర మూకల అంతు చూసింది భారత సైన్యం. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో త్రివిధ దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిభిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతయ్యారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.