Rajnath Singh: అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టాం.. రక్షణ మంత్రి
ABN , Publish Date - May 07 , 2025 | 05:32 PM
పహల్గాంలో ఉగ్రవాదులు 25 మంది టూరిస్టులు, ఒక కశ్మీర్ పోనీ రైడ్ ఆపరేటర్‌ను అత్యంత పాశవికంగా హత్య చేశారని, ఇందుకు ప్రతిగా ఉగ్రవాదులపై దాడి చేసే హక్కును భారత్ సమర్ధవంతంగా ఉపయోగించుకుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో పహల్గాం ఉగ్రదాడిలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా చంపిన వారికి గట్టి సమాధానమిచ్చామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టామని, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత జాగరూకతతో ఈ దాడులు నిర్వహించామని చెప్పారు. మన సైనికులు అద్భుత పరాక్రమం ప్రదర్శించారని కొనియాడారు. 6 రాష్ట్రలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో బోర్టర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టిన 50 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని సాయుధ బలగాలు విజయవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించారని అభినందించారు.
Operation Sindoor: సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
పహల్గాంలో ఉగ్రవాదులు 25 మంది టూరిస్టులు, ఒక కశ్మీర్ పోనీ రైడ్ ఆపరేటర్‌ను అత్యంత పాశవికంగా హత్య చేశారని, ఇందుకు ప్రతిగా ఉగ్రవాదులపై దాడి చేసే హక్కును భారత్ సమర్ధవంతంగా ఉపయోగించుకుందని రాజ్‌నాథ్ చెప్పారు. భారత సాయుధ బలగాలు చరిత్రను తిరగరాశాయని అన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. రామాయణంలో రావణాసురుడు సీతమ్మ వారిని నిర్బంధించిన అశోకవనాన్ని హనుమంతుడు నాశనం చేశాడని, అదే స్ఫూర్తితో భారత్ ప్రతిదాడి జరిపిందని ఉదహరించారు. ''మన అమాయక పౌరులను ఎవరైతే చంపారో వారిని మాత్రమే మనం చంపాం'' అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
''ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేశాయి. గట్టి బదులిచ్చాయి. కచ్చితమైన ప్రణాళికతో ఇదంతా చేశాం. ఉగ్రవాదుల నైతికస్థైరాన్ని దెబ్బతీశాం. ఈ దాడులను ఉగ్రవాద శిబిరాలు, మౌలిక వసులకే పరిమితం చేశాం. మన సాయుధ బలగాల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాను'' అని రాజ్‌నాథ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: వ్యోమికా, ఖురేషీ గురించి ఈ విషయాలు తెలుసా
Operation Sindoor: భారత్ సైనిక దాడులపై పాక్ రక్షణ మంత్రి ఏమన్నారంటే
ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా