Operation Sindoor: వ్యోమికా, ఖురేషీ గురించి ఈ విషయాలు తెలుసా
ABN , Publish Date - May 07 , 2025 | 03:47 PM
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ గురించిన వివరాలను ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వెళ్లడించారు. వారే కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.
న్యూఢిల్లీ, మే 7: జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో దాడులు నిర్వహంచగా.. దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ఈరోజు (బుధవారం) ఉదయం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్ ఆపరేషన్‌పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్ భారత్ చర్చించుకుంటోంది. కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ క్లిష్టమైన ఆపరేషన్ గురించి చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎవరు.. వీరి బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్..
పైలెట్ కావాలన్నది వ్యోమికా సింగ్ కల. అందుకోసం ఎంతో కష్టపడ్డారు కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యోమికా.. తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే 2004లో ఐఏఎఫ్‌లో చేరారు ఆమె. 2017లో వింగ్ కమాండ్ హోదా పొందారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా చేతక్, చీతా హెలికాఫ్టర్లను నడిపి రికార్డు సృష్టించారు వ్యోమికా సింగ్. వైమానికి రంగంలో ఎంతో పేరు పొందారు. హై-రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్లలో వ్యోమికా సింగ్ సేవలందించారు.
కర్నల్ సోఫియా ఖురేషి ఎవరంటే
సోఫియా ఖురేషీ స్వస్థలం గుజరాత్. 1990లో సోఫియా సైన్యంలో చేశారు. కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి.. 2016లో పుణెలో జరిగిన ఎక్సర్‌సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి తొలి మహిళా అధికారణిగా చరిత్ర సృష్టించారు. ఇందులో 18 దేశాలు పాల్గొనగా.. కేవలం భారత్ బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించారు. ఆమెకు పీస్ కీపర్‌గా ఎంతో అనుభవం ఉంది. 2006 కాంగోలో పీస్ మిషన్‌కు ఆమె అందించిన సహకారం ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణం. మూడు దశాబ్దాలకు పైగా భారత సైన్యానికి సేవలందించారు. ఆమె రాజీలేని వైఖరి, నిర్భయ ప్రయత్నాలతో ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. అలాగే దేశ యువతను భారత సైన్యంలో చేరాలని కూడా సోఫియా ఖురేషి పిలుపునిచ్చారు.
Operation Sindoor: 9 టెర్రర్ క్యాంప్‌లు.. జస్ట్ 24 నిమిషాల్లో ఖతం..
ఇవి కూడా చదవండి
Pawan Kalyan: ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామం
Operation Sindoor: పాక్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
Read Latest National News And Telugu News